
అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. డైరెక్టర్ ప్రవీణ్ సైతం రివ్యూలు బాగుంటేనే పరదా చూడాలని ఆడియన్స్కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా మూవీ సెట్లో షాట్ ఆలస్యం కావడంపై స్పందించింది.
అనుమప మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు నోరు విప్పడానికి భయపడతారు. ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అంటారు. ఉదయం 7 గంటలకు షూట్కు వెళ్తే.. 9:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకు ఆలస్యమైందని అడిగితే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ముద్ర వేస్తారు. కో యాక్టర్ ఆలస్యంగా వచ్చినప్పుడు మమ్మల్ని ముందు ఎందుకు పిలవాలి. ముందుగానే సెట్కు పిలిచి రెండున్నర గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించాలి. ఈ గ్యాప్లో చాలా షాట్స్ తీయొచ్చు కదా అని అడిగితే.. నా డబ్బులు కదా మీకేంటి ఇబ్బంది అని అంటారు. అమ్మాయిలు ఏదైనా డైెరెక్ట్‌గా అడిగేస్తారు. అబ్బాయిలను మరో విధంగా ట్రీట్ చేస్తారు. అందరూ ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదు' అని అన్నారు.
కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.