
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లేటెస్ట్ మూవీ పరదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్‌లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
అంత ఈజీ కాదు
ఎందుకిలా ఎమోషనల్ అవుతున్నారన్న ప్రశ్నకు.. ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ ఒకమ్మాయి సినిమా చేసి ముందుకు రావడం అంత సులువేమీ కాదు. మూవీ చేయడానికన్నా దాన్ని రిలీజ్ చేయడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. నా సినిమా కాబట్టి చూడమని చెప్పడం లేదు. నేను చేసిన సినిమాల్లోనే సగం నాకు నచ్చవు. విమర్శిస్తూ ఉంటాను. కానీ, ఈ మూవీలో నేను విమర్శించడానికేం లేదు అంటూ ఏడ్చేసింది.
చదవండి: Bigg Boss: 15 మందికి అగ్నిపరీక్ష.. ఫైర్ మీదున్న జడ్జిలు!