
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show)కు రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. అలాంటివారికి ఓ అవకాశం కల్పించేందుకు కామన్ మ్యాన్ ఎంట్రీ పేరిట కొందరిని హౌస్‌లోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఈసారి కామన్ మ్యాన్‌గా రావాలనుకుంటే అగ్నిపరీక్షను గెలిచి రావాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. ఏదేమైనా సరే బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu)వ సీజన్‌లో కనిపించాలని దాదాపు 20 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు.
జడ్జిలుగా ముగ్గురు
వారిలో 100 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా 45 మందిని సెలక్ట్ చేశారు. వీరిని అగ్నిపరీక్ష కార్యక్రమానికి పిలిచారు. ఈ కార్యక్రమానికి మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్‌లను జడ్జిగా నియమించారు. వీళ్లు.. మొదటి రౌండ్‌లో 15 మందిని ఎంపిక చేశారు. వాళ్లెవరంటే..
1. దివ్య నిఖిత (ఇన్‌ఫ్లుయెన్సర్)
2. అనూష రత్నం (ఇన్‌ఫ్లుయెన్సర్)
3. శ్వేతా శెట్టి
4. శ్రియ
5. డిమాన్ పవన్
6. దమ్ము శ్రీజ (ఇన్‌ఫ్లుయెన్సర్)
7. ప్రసన్న కుమార్ (దివ్యాంగుడు)
8. ప్రశాంత్ (లాయర్)
9. షాకీబ్ (ఇన్‌ఫ్లుయెన్సర్)
10. కల్కి (మిస్ తెలంగాణ రన్నరప్)
11. దాలియా షరీఫ్ (జిమ్ ట్రైనర్)
12. మాస్క్ మ్యాన్
13. పవన్ కల్యాణ్ (జవాన్)
14. మరియాద మనీష్ (బిజినెస్‌మెన్)
15. ప్రియా శెట్టి
అగ్నిపరీక్ష వీడియో లీక్..
వీరిలో కల్కి.. అభిజిత్‌తో స్టెప్పులేయించిందని తెలుస్తోంది. ఇక అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకైంది. అందులో బిందు మాధవి.. ఏయ్, ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తున్నావ్? అంటూ ఓ కంటెస్టెంట్‌పై అసహనం వ్యక్తం చేసింది. నవదీప్ అయితే.. ఏ.. పో.. అంటూ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇక అభిజిత్ కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడని భోగట్టా! ఇకపోతే 15 మందిలో నుంచి 5 లేదా 9 మందిని సెలక్ట్ చేసి బిగ్‌బాస్ హౌస్‌కు పంపించనున్నారు. ఈ అగ్నిపరీక్ష షో జియోహాట్‌స్టార్‌లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా