కుప్పలుతెప్పలు వద్దు.. ఒక్క సినిమానే చేస్తా!: ఆలియా భట్‌ | Alia Bhatt declares she wants to do one film at a time | Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఒక్క సినిమానే చేస్తా! ఇప్పటికే చాలా నేర్చుకున్నా..

Jan 1 2026 12:27 PM | Updated on Jan 1 2026 1:00 PM

Alia Bhatt declares she wants to do one film at a time

'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' మూవీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఈమె చివరగా జిగ్రా (2024) సినిమాలో కనిపించింది. 2025లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్‌ అండ్‌ వార్‌ మూవీస్‌ చేస్తోంది.

అర్థం చేసుకోగలిగా..
తాజాగా ఆలియా భట్‌ మాట్లాడుతూ.. నేను హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ అనే హాలీవుడ్‌ సినిమా చేశాను. కానీ అందులో నా పాత్రకు మరీ ఎక్కువ స్టంట్‌ సీన్లు లేవు. కానీ ఆల్ఫా మూవీలో ఎక్కువ యాక్షన్‌ సన్నివేశాల్లో నటించాను. పాప పుట్టాక ఇలాంటి సీన్లలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నా శరీరం ఇటువంటి సన్నివేశాల్లో నటించేందుకు ఏమేరకు సహకరిస్తుందనేది అర్థం చేసుకోగలిగాను.

అదే నేర్చుకున్నా..
లవ్‌ అండ్‌ వార్‌ మూవీ అయితే నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించలేదు. సంజయ్‌ లీలా భన్సాలీతో పని చేయడం అందమైన అనుభవాలను మిగిల్చింది. సెట్‌లో ఎంతగానో నేర్చుకున్నాను. గంగూభాయ్‌ కతియావాడి సెట్‌లో మైండ్‌లో ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా.. ఖాళీ మైండ్‌తో ముందుకు వెళ్లాలని నేర్చుకున్నాను. అప్పుడే అన్నింటినీ పరిశీలించొచ్చు, గమనించి నేర్చుకోవచ్చు.

రెండూ బ్యాలెన్స్‌
ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒక్కసారి ఒక ప్రాజెక్టులో మాత్రమే నటించాలనుకుంటున్నాను. ఓ పక్క కూతురు రాహాను చూసుకుంటూ మరోపక్క ఏదైనా ఒక సినిమాలో మాత్రమే లీనమవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: మురారి క్లైమాక్స్‌.. కాస్త తేడా కొట్టినా నన్ను చంపేవాళ్లే: దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement