
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పరదా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాటను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఎగరేయి నీ రెక్కలే అంటూ సాగే బ్యూటీఫుల్ సాంగ్ను విడుదల చేశారు.
ఈపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. రితేశ్ జీ రావు ఆలపించారు. ఈ సాంగ్ను గోపి సుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల థియేటర్లో సందడి చేయనుంది.
Let the music take you deep within🎶
3rd single from #Paradha is here!#YegareyiNeeRekkale #AkaleEeNeermutthukal Lyrical Video OUT NOW
Telugu: https://t.co/7EUihYEyKQ
Malayalam: https://t.co/wQ31mwufie
In cinemas AUG 22@anupamahere @darshanarajend @sangithakrish @GopiSundarOffl pic.twitter.com/OA2EveLA4D— Paradha Movie (@Paradhamovie) August 5, 2025