వైరల్ వయ్యారి సాంగ్‌.. హీరోయిన్‌ శ్రీలీలను మించిపోయిన బామ్మ..! | Tollywood actress Sreeleela Viral Vayyari Song Dance Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Vayyari Song: వైరల్ వయ్యారి సాంగ్‌.. బామ్మ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే..!

Jul 16 2025 9:14 PM | Updated on Jul 16 2025 9:33 PM

Tollywood actress Sreeleela Viral Vayyari Song Dance Goes Viral

శ్రీలీల సాంగ్చిన్నా పెద్దా లేకుండా అందరిని ఊపేస్తోంది. గతేడాది పుష్ప-2 మూవీలో కిస్సిక్ సాంగ్తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి గూస్బంప్స్ తెప్పించే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన లేటేస్ట్మూవీ 'జూనియర్' నుంచి వైరల్ వయ్యారి అంటూ ఇటీవలే లిరికిల్ సాంగ్రిలీజ్చేయగా యూట్యూబ్ను షేక్ చేసింది. పాటతో మరోసారి మాస్ ఆడియన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయమవుతోన్న సినిమా జూలై 18 థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు మేకర్స్. ఈవెంట్లో వైరల్ వయ్యారి సాంగ్ను ప్రదర్శించారు. పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్తో అదరగొట్టేసింది. వైరల్ వయ్యారి వేదికపై స్టెప్పులతో ఊపు ఊపేసింది. పక్కనే యాంకర్ సుమ బామ్మతో కలిసి కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement