వీకెండ్‌లో ముందు ఫైర్ చూపించి, తర్వాత సరదాగా ఉంటాడు కింగ్ నాగార్జున. కానీ, ఈసారి ఫైర్‌ను పక్కనపెట్టేసి అందరితో కబుర్లు చెప్తూ కూల్‌గా కనిపించాడు. ముందుగా పవన్‌ను లేపి అతడి డ్రెస్ బాగుందన్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇమ్మాన్యుయేల్.. ఆ డ్రెస్‌లో పవన్ మ్యాజిక్ షోలు చేసేవాడిలా ఉన్నాడని కామెడీ చేశాడు. షర్ట్‌లో నుంచి పావురాలు, పాములు తీస్తాడని సెటైర్లు వేశాడు.
కల్యాణ్‌కు సెల్యూట్
ఆ సంగతిని నాగ్ గుర్తు చేస్తూ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను అభినందించాడు. అతడు చివరి కెప్టెన్ అయినప్పుడు ఎలాగైతే సెల్యూట్ చేశాడో, ఇప్పుడు కూడా అలాగే మరోసారి సెల్యూట్ చేసి మరీ ప్రశంసించాడు. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో ఇమ్మాన్యుయేల్ చేసిన తప్పును వీడియో వేసి చూపించాడు నాగ్.
తప్పును ఎత్తి చూపుతూనే పొగడ్తలు
సంజనాతో ఇమ్మూ పోటీపడ్డ టాస్క్ అది. అందులో ఇమ్మాన్యుయేల్ తాడును మధ్యలో ఒకసారి వదిలేశాడు. గేమ్ రూల్స్ ప్రకారం తాడు వదిలేస్తే ఔట్.. కానీ దాన్ని సంచాలక్ రీతూ గమనించకపోయేసరికి అతడే గెలవడం.. అలా తర్వాతి టాస్కులు కూడా గెలిచి చివరి వరకు రావడం జరిగింది. అలా తాడును వదిలేయడాన్ని తప్పుపట్టిన నాగ్.. లెక్కల్లో మాత్రం ఇరగ్గొట్టేశావ్.. అని మెచ్చుకున్నాడు.


