'నా కొంప ఎలా ముంచబోతున్నావో చెప్పు రాధిక'..క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Siddu Jonnalagadda Tillu Square Movie Second Song Release Today | Sakshi
Sakshi News home page

Tillu Square Movie: 'మీరంతా రాధిక కాలేజీ స్టూడెంట్స్'.. క్రేజీ సాంగ్ చూసేయండి!

Published Mon, Nov 27 2023 4:47 PM | Last Updated on Tue, Nov 28 2023 10:17 AM

Siddu Jonnalagadda Tillu Square Movie Second Song Release Today - Sakshi

'డీజే టిల్లు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.   'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ  మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.

ఈ మూవీలోని సెంకడ్‌ సింగిల్‌ పాటను మేకర్స్ రిలీజ్‌ చేశారు.  ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్‌ 'టికెట్టే కొనకుండా' అభిమానులను అలరిస్తోంది. తాజాగా 'రాధిక' పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాగా.. ఈ చిత్రం 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement