
టాలీవుడ్‌లో వర్కర్స్ యూనియన్ తమ జీతాలను పెంచాలని చెప్పి ఆగస్టు 01వ తేదీ నుంచి షూటింగ్స్ బంద్ చేశారు. తమకు 30 శాతం మేర జీతాలు పెంచి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు నిర్మాతలు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రం యూనియన్‌తో సంబంధం లేకుండా పని తెలిసిన వాళ్లని తీసుకునేందుకు ఏకంగా వెబ్‌సైట్ ఓపెన్ చేసింది. ప్రస్తుతానికైతే తెలుగు నిర్మాతలు vs యూనియన్స్ అన్నట్లు వివాదం నడుస్తోంది. తాజాగా నిర్మాతలు వెళ్లి చిరంజీవిని కూడా కలిసి వచ్చారు.
(ఇదీ చదవండి: ఇల్లు కట్టిస్తానని సోనూసూద్ మాటిచ్చారు: షిఫ్ వెంకట్ కూతురు)
ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయమై స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. 'కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‍లో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడతాను. ఈ అంశాలన్నిటినీ దిల్ రాజుకు అప్పగించాం. ఆయన చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. టికెట్ల ధరలు పెంచేందుకు మేం అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి' అని అన్నారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ)