‍'కిష్కింధపురి' సినిమా రివ్యూ | Kishkindhapuri Movie Review And Rating In Telugu | Bellamkonda Sai Sreenivas | Anupama Parameswaran | Sakshi
Sakshi News home page

Kishkindhapuri Review: బెల్లంకొండ శ్రీనివాస్-అనుపమ 'కిష్కింధపురి' రివ్యూ

Sep 12 2025 9:23 AM | Updated on Sep 12 2025 11:55 AM

Kishkindhapuri Movie Review Telugu

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'. ఇది ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లే ట్రైలర్, పోస్టర్స్ లాంటివి కాస్త ఆసక్తికరంగా అనిపించాయి. మరి మూవీ టీమ్ చెప్పినట్లు ఈ చిత్రం భయపెడుతూ థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా)

కథేంటి?
రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్‌కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూవీ మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరూ ఫోన్ కూడా పట్టుకోరు, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. తర్వాత దీన్ని కవర్ చేసుకున్నాడు అదే వేరే సంగతి. మరి హీరో చెప్పినట్లు సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది అంతే!

హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే 'కిష్కింధపురి' కూడా తీశారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ పార్ట్స్‌గానే వర్కౌట్ అయింది. దెయ్యం వెనకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ అన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. సౌండ్స్‌తో భయపెట్టడం వరకు సరే గానీ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండాఫ్‌లో తగ్గిపోయాయి. సాధారణంగా హారర్ మూవీస్ అనగానే చిల్ మూమెంట్స్ కీలకం. అంటే ప్రేక్షకుల్ని సడన్‌గా భయపెట్టాలి. ఇందులో ఒకటి రెండు చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు పెద్దగా లేవు.

ప్రారంభంలో సగటు తెలుగు సినిమాల్లో ఉన్నట్లే హీరో ఇంట్రడక్షన్, లవ్ సాంగ్.. ఇలా సాగుతుంది. ఎ‍ప్పుడైతే 'సూవర్ణమాయ' రేడియో స్టేషన్‌లో హీరోహీరోయిన్‌తో అడుగుపెడతారో అసలు కథ మొదలవుతుంది. ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలెట్స్‌ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్‌గానే అనిపించాయి. ఓవైపు సూవర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే, మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండాఫ్ అంతా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే స్టోరీ, ట్విస్టులు బాగున్నాయి. కానీ ఇదంతా ఎక్కడో తెలుగు సినిమాలో చూసేశామే అనే ఫీలింగ్ కలుగుతుంది. 

ఎవరెలా చేశారు?
బెల్లంకొండ శ్రీనివాస్‌ హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. రాఘవ్ పాత్రలో పర్లేదనిపించాడు. హీరోయిన్‌ అనుపమకి మాత్రం మంచి స్కోప్ దొరికింది. మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలానే అనిపిస్తుంది గానీ సెకండాఫ్‌లో ఈమె దెయ్యంగా మారే సీన్స్‌లో ఆకట్టుకుంది. విశ్రవ పుత్రగా శాండీ మాస్టర్ మెప్పించాడు. ప్రారంభంలో హైపర్ ఆది, సుదర్శన్ కాస్త నవ్వించేందుకు ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్ పాండే తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే ఓకే.

టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్నిచోట్ల స్టోరీలో లాజిక్స్ మిస్ కావడం డిసప్పాయింట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలా ఉంది. దాన్ని కాస్త నేచురల్‌గా చేసుండాల్సింది. దర్శకుడు భయపెడదామని బాగానే ప్రయత్నించాడు కాకపోతే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది!

అలానే 'కిష్కింధపురి' అనే టైటిల్ పెట్టారు. ప్రారంభంలో కోతులతో ఓ సీన్ చూపించడం, సినిమాలో ఊరి పేరు తప్పితే ఎక్కడా టైటిల్‌కి స్టోరీకి కనెక్షన్ అనిపించలేదు. దీని బదులు 'సూవర్ణమాయ రేడియో స్టేషన్' అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: మిరాయ్‌ ట్విటర్‌ రివ్యూ)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement