తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్‌తో తనూజ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.
అందులో ఏం రాసిందంటే..
బిగ్‌బాస్ సీజన్‌కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్‌బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది.
అదే అతిపెద్దక్సెస్
మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్‌బాస్ హౌస్‌ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను.
గుణపాఠం నేర్చుకున్నా..
మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.
నిజమైన ఫైటర్
మీలో ఒకరిగా హౌస్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్‌వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు.


