చాన్నాళ్లుగా టాలీవుడ్‌లో ఉంటూ సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందు.. రీసెంట్ టైంలోనూ దండోరా, వనవీర తదితర చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్, విలన్ తరహా పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. వీటితో పాటు హీరోగానూ ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే 'సైక్ సిద్ధార్థ'. థియేటర్లలో ఘోరమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)
పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'సైక్ సిద్ధార్థ'.. ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. హీరో నందు.. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఎమోషనల్ కూడా అయిపోయాడు. ఈ సినిమాతో హీరోగా నిలబడతానని చెప్పాడు కూడా. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు దీన్ని ఫిబ్రవరి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేనున్నారు. గోల్డ్ యూజర్స్ ఒకరోజు ముందే చూడొచ్చు. ఇందులో నందు, యామినీ భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
'సైక్ సిద్ధార్థ' విషయానికొస్తే.. సిద్ధార్థ (శ్రీ నందు) అనుకోకుండా పరిచయమైన త్రిష(ప్రియాంక)తో ప్రేమలో పడతాడు. వీళ్లు మన్సూర్ (సుఖేష్‌రెడ్డి)తో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మొదలుపెడతారు. అందులో రూ.2 కోట్ల పెట్టుబడి సిద్ధార్థదే. కానీ మన్సూర్, త్రిష కలిసిపోయి.. సిద్ధార్థని దారుణంగా మోసం చేస్తారు. దీంతో అన్నీ పోగొట్టుకున్న సిద్ధార్థ.. చివరకు హైదరాబాద్‌లోని ఓ బస్తీలో చిన్న గది అద్దెకు తీసుకుని బతుకుతుంటాడు. సిద్ధార్థ ఉంటున్న బిల్డింగ్‌లోకి తన కొడుకుతో కలిసి శ్రావ్య (యామినీ భాస్కర్) అద్దెకు వస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక వేరేగా వచ్చి బతుకుతూ ఉంటుంది. తర్వాత సిద్ధార్థ-శ్రావ్య ఎలా కలిశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)


