పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఎమిరేట్స్‌ కీలక నిర్ణయం | West Asia Tensions: Emirates Suspends Dubai Flights Amid Missile Scare | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఎమిరేట్స్‌ కీలక నిర్ణయం

Mar 7 2026 3:32 PM | Updated on Mar 7 2026 4:22 PM

 West Asia Tensions: Emirates Suspends Dubai Flights Amid Missile Scare

దుబాయ్‌ విమాన సర్వీసులను ఎమిరేట్స్‌ తాత్కాలికంగా నిలిపేసింది. ఎయిర్‌పోర్టుకు రావద్దని ప్రయాణికులకు ఎమిరేట్స్‌ సూచించింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై మరో మిస్సైల్‌ దాడి జరిగింది. ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ భీకర దాడులు చేసింది. వెంటనే అలర్ట్‌ అయిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. ప్రయాణికులను తరలించారు. మిస్సైల్‌ దాడితో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

ఇరాన్‌ క్షిపణుల, డ్రోన్లను యూఏఈ వైమానిక దళం అడ్డుకుంది. భద్రత కారణంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను అధికారులు బంద్‌ చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు దుబాయ్‌ వచ్చే, వెళ్లే అన్ని విమానాలు రద్దయ్యాయి. మరోవైపు, గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. ఇరాన్ దాడి చేసిన పొరుగు దేశాలకు నేను క్షమాపణలు కోరుతున్నారు.

పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయకూడదని.. నిన్న సమావేశమైన తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్ అంగీకరించింది. పొరుగు దేశాలపై ఎటువంటి క్షిపణులను ప్రయోగించం. ఆయా దేశాల ప్రాంతాల నుంచి ఇరాన్‌పై దాడి జరిగితేనే.. ఇరాన్ తిరిగి ప్రతిదాడి చేస్తుంది. ఈ నిర్ణయాన్ని తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్ అంగీకరించింది’’ అని ఇరాన్‌ అధ్యక్షుడు తెలిపారు.



 

Advertisement
 
Advertisement
Advertisement