
సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా హర్యానా కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌లో సెబీకి దరఖాస్తు చేసిన కంపెనీ తాజాగా అనుమతి పొందింది.
ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఏరోప్లేన్ బ్రాండు కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం ప్రాసెసింగ్‌తోపాటు ఎగుమతులు చేపడుతోంది. దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు కేఆర్‌బీఎల్, ఎల్‌టీ ఫుడ్స్‌సహా సర్వేశ్వర్ ఫుడ్స్ తదితరాలతో పోటీ పడుతోంది. 2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో రూ. 1,421 కోట్ల ఆదాయం, రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది.