రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పేమెంట్ అగ్రిగేటరుగా కార్యకలాపాలు నిర్వహించేందుకు పేటీఎం పేమెంట్స్ సర్విసెస్‌కి (పీపీఎస్‌ఎల్) రిజర్వ్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఆగస్టులో సూత్రప్రాయ అనుమతులు ఇచ్చిన ఆర్‌బీఐ తాజాగా సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ) జారీ చేసినట్లు కంపెనీ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది.
అలాగే కొత్త వ్యాపారులను చేర్చుకోవడంపై 2022 నవంబర్ 25న విధించిన ఆంక్షలను కూడా రిజర్వ్ బ్యాంక్ తొలగించింది. పేమెంట్ అగ్రిగేటరు లైసెన్సు కోసం 2020 నవంబర్‌లో పీపీఎస్‌ఎల్ దరఖాస్తు చేసుకుంది. అయితే, 2022 నవంబర్‌లో దాన్ని తిరస్కరించిన ఆర్‌బీఐ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకి అనుగుణంగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. దానికి తగ్గట్లు 2022 డిసెంబర్ 14న పీపీసీఎల్ మరోసారి దరఖాస్తు చేసుకుంది.


