సెబీ నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్
జాబితాలో ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్
ధారివాల్ బిల్డ్‌టెక్, బీఎల్‌ఎస్ పాలి
ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్ ర్యాలీలోనూ ఆటుపోట్లను చవిచూస్తుంటే మరోవైపు ఈ కేలండర్ ఏడాది(2025) అధిక ఇష్యూలు, అత్యధిక నిధుల సమీకరణతో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు తెరతీశాయి. ఈ బాటలో ప్రైమరీ మార్కెట్లు ఏడాది చివరిలోనూ సందడి చేస్తున్నాయి. తాజాగా 3 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ తాజాగా లిస్ట్‌కాగా.. ఈ వారం గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీసహా.. 4 ఎస్‌ఎంఈ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు ప్రైమరీ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ జాబితాలో ధారివాల్ బిల్డ్‌టెక్, ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, బీఎల్‌ఎస్ పాలిమర్స్ చేరాయి. ఈ మూడు కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఈ సంస్థలన్నీ ఐపీవో ద్వారా కొత్తగా ఈక్విటీ జారీతో నిధుల సమీకరణను చేపట్టనున్నాయి. ఐపీవో తదుపరి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి.
కన్‌స్ట్రక్షన్ కంపెనీ
పబ్లిక్ ఇష్యూలో భాగంగా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ధారివాల్ బిల్డ్‌టెక్ రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 203 కోట్లు నిర్మాణ రంగ పరికరాల కొనుగోలుకి, రూ. 174 కోట్లు ముందస్తు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, పీఎంజీఎస్‌వై రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు నిర్మించే కంపెనీ రైల్వే, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది.
క్లౌడ్ ఇన్‌ఫ్రా సేవలు
క్లౌడ్, మేనేజ్‌డ్ సర్వీసుల సంస్థ ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 481 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుతోపాటు డేటా సెంటర్ల మౌలికసదుపాయాల ఏర్పాటుకు వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఐఏఏఎస్, ఎస్‌ఏఏఎస్ ఆధారిత క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సర్వీసులు, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లు అందిస్తోంది.
కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్
అవసరాలకుతగిన(కస్టమ్) పాలిమర్ కాంపౌండ్స్ రూపొందించే బీఎల్‌ఎస్ పాలిమర్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీక రించిన నిధుల్లో రూ. 70 కోట్లు కొన్ని ప్రొడక్టుల తయారీ సౌకర్యాల విస్తరణకు, రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ టెలికం, విద్యుత్, రైల్వే, చమురు–గ్యాస్ తదితర రంగాలకు కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అందిస్తోంది.
సెబీకి టన్బో ఇంజినీరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు
గ్లోబల్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ ప్రధాన కంపెనీ(ఓఈఎం) టన్బో ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1,80,85,246 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. అయితే కొత్తగా ఈక్విటీ జారీ చేయబోదు. 2003లో ఏర్పాటైన కంపెనీ తొలిదశలో యూఎస్ రక్షణ శాఖ, సర్నాఫ్ కార్పొరేషన్‌తో కలసి పనిచేసింది.
ఆపై 2012లో ప్రస్తుత ప్రమోటర్ల ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధానంగా సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్ సిస్టమ్స్‌ను రూపొందిస్తోంది. విజిబుల్, ఇన్‌ఫ్రారెడ్, మల్టీసెన్సార్ ఇమేజింగ్ టెక్నాలజీలతోకూడిన టాక్టికల్, ప్లాట్‌ఫామ్ సిస్టమ్స్ తయారు చేస్తోంది. ప్రపంచస్థాయిలో రక్షణ రంగ దళాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. 2025 సెపె్టంబర్30కల్లా దాదాపు రూ. 267 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. గత రెండు నెలల్లోనూ రూ. 72 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది.


