కారు మైలేజ్‌ కోసం.. ముఖ్యం ఈ వేగం! | Speed is Important For The Car to Give More Mileage | Sakshi
Sakshi News home page

కారు మైలేజ్‌ కోసం.. ముఖ్యం ఈ వేగం!

Feb 8 2026 8:45 PM | Updated on Feb 8 2026 8:53 PM

Speed is Important For The Car to Give More Mileage

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.

సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.

కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్‌లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది.

స్థిరమైన వేగం మైలేజ్‌కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్‌ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.

ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచకూడదు.

Advertisement
 
Advertisement
Advertisement