కర్ణాటక: మద్యం తాగి కారు నడుపుతూ చెట్టును ఢీకొనగా ఒకరు మరణించారు. ఈ ఘటన నగరంలో హెబ్బగోడి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. తరువాత కారులో ఇళ్లకు బయల్దేరారు. కానీ ఏదో విషయమై కారులోనే వాదులాట మొదలైంది. కారు డ్రైవింగ్ చేస్తున రోషల్ హెగ్డేను ప్రశాంత్ దూషించడంతో అతడు అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ చనిపోగా,, రోషన్‌హెగ్డే తీవ్రంగా గాయపడ్డాడు. కారు ప్రమాద దృశ్యాలు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.


