అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు | No-one will hire women: India top court rejects menstrual leave petition | Sakshi
Sakshi News home page

అప్పుడు మహిళలకు ఉద్యోగాలివ్వరు

Mar 14 2026 2:46 AM | Updated on Mar 14 2026 2:46 AM

No-one will hire women: India top court rejects menstrual leave petition

న్యూఢిల్లీ: మహిళలకు రుతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవ్వరూ ఉద్యోగాల్లోకి తీసుకోరని, ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఋతుక్రమ సమయంలో విద్యారి్థనులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడింది. ‘ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది.

రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న ‘చెడు’గా పరిగణిస్తారు’అని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు.

అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్‌ న్యాయవాది ఎమ్‌.ఆర్‌.శంషాద్‌ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు ఇలాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ‘అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. న్యాయవ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెబుతారు. వారి కెరీర్‌ ముగిసిపోతుంది.’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement