రూ. 26 వేలకే కారు.. తీరా చూస్తే? | Fraud in the name of a car for just Rs. 25,000 in Mallapur | Sakshi
Sakshi News home page

రూ. 26 వేలకే కారు.. తీరా చూస్తే?

Jan 26 2026 2:41 PM | Updated on Jan 26 2026 3:31 PM

Fraud in the name of a car for just Rs. 25,000 in Mallapur

సాక్షి హైదరాబాద్: మల్లాపూర్‌లో  తప్పుడు ప్రచారంతో తమను బురిడీ కొట్టిద్దామని చూసిన నిర్వాహకులకు ప్రజలు దేహశుద్ధి చేశారు. మల్లాపూర్‌లో రూ.26 వేలకే కారు అందిస్తామని కొద్దిరోజుల ఇన్‌స్టాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇది నమ్మిన ప్రజలు ఈ రోజు ( సోమవారం) పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే అది మోసం అని తేలింది. దీంతో ఆగ్రహాం చెందిన ‍ప్రజలు కర్రలతో నిర్వాహాకులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని శాంతిపజేశారు. అనంతరం నిర్వాహకులను అదుపులోకి తీసుకొని నాచారం పీఎస్‌కు తరలించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement