నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి! | Post Office RD Scheme Deposit RS 5000 Monthly and Get RS 8 Lakh in 10 Years | Sakshi
Sakshi News home page

పోస్టాఫీస్ స్కీమ్: నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!

Feb 8 2026 7:43 PM | Updated on Feb 8 2026 7:58 PM

Post Office RD Scheme Deposit RS 5000 Monthly and Get RS 8 Lakh in 10 Years

ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.

నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.

దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.

నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement