సాక్షి, హైదరాబాద్: కోస్గిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన.
పనికి మమాలిన శపథాలు చేయడం రేవంత్‌కు అలవాటే. అడ్డంగా దొరికిపోవడం రేవంత్‌కు మామూలే. 2028లో ప్రజలు కాంగ్రెస్‌ని బొందపెట్టడం ఖాయం. పాలమూరు ప్రాజెక్టు గొంతు ఎవరు కోశారో అందరికీ తెలుసు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది!. అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!
సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీ కొడుతున్నా ఇంకా మారవా?. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం!. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో, ఇటు జనం మధ్య ఎండగడతాం అంటూ ట్వీట్ చేశారాయన.
నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?
జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?
పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?
తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్…— KTR (@KTRBRS) December 24, 2025


