‘నంబర్‌’ ప్లేట్‌ ఫిరాయించాడు | Hyderabad Man Caught Tampering Vehicle Number Plate To Escape From E-Challans, More Details Inside | Sakshi
Sakshi News home page

‘నంబర్‌’ ప్లేట్‌ ఫిరాయించాడు

Feb 9 2026 7:53 AM | Updated on Feb 9 2026 10:22 AM

Man apprehended for number plate tampering in Hyderabad

ఈ– చలాన్‌ తప్పించుకోవడానికి ఎత్తుగడ  

సాక్షి, హైదరాబాద్‌: హెల్మెట్‌ ధరించకపోడం సహా పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి ఈ–చలాన్లు తప్పించుకోవడానికి తన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ ప్లేట్‌లో ఓ సంఖ్యను మార్చేశాడు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు జారీ చేసిన ఈ– చలాన్లు మరో వాహనం యజమానికి వెళ్లాయి. ఆయన ఫిర్యాదుతో ట్రాఫిక్‌ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. 

మలక్‌పేటకు చెందిన సయ్యద్‌ అలీవుద్దీన్‌ ద్విచక్ర వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ టీఎస్‌11ఈజెడ్‌ 2936. ఈ–చలాన్లు తప్పించుకుపోవడానికి ఉద్దేశపూర్వకంగా దాన్ని టీఎస్‌11ఈజెడ్‌ 2836గా మార్చాడు. దీంతో ఇతడు చేసిన ఉల్లంఘనలకు సంబం«ధించిన చలాన్లు ‘2836’ వాహన యజమాని ఫహీమ్‌ అలీకి వెళ్లాయి. ఇలా దాదాపు 23 చలాన్లు అందుకున్న ఆయన చివరకు నగర ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధ్యుడిని పట్టుకోవడానికి ట్రాఫిక్‌ పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాలను పరిశీలించి అలీవుద్దీన్‌ ఆచూకీ కనిపెట్టారు. 

నిందితుడిపై చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కోర్టులో నిరూపితమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ వాహనం నంబర్‌ ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే వెబ్‌సైట్‌:  ఈ– చలాన్‌ తప్పించుకోవడానికి ఎత్తుగడ   ఈమెయిల్‌: echallan helpdesk.hyd@gmail.com, వాట్సాప్‌: 87126 61690లకు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ సూచించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement