
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్‌టార్క్ 150’ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. స్పోర్టీ, ప్రీమియంలుక్‌తో ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్‌షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్‌టీ వేరియంట్ ధర రూ.1,29,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ ధరల్లో ఇటీవలి జీఎస్‌టీ శ్లాబుల సరళీకరణను పరిగణించలేదని, సెప్టెంబర్ 22 తర్వాత కొత్త ధరలు అప్‌డేట్ అయ్యే అవకాశం ఉందని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ఈ స్కూటర్ ఆవిష్కరించిన నేపథ్యంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెడ్ కమ్యుటర్, ఈవీ బిజినెస్ అండ్ హెడ్ బ్రాండ్ మీడియా) అనిరుద్ధా హల్దార్ మాట్లాడుతూ..‘అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించిన ఈ స్కూటర్‌ను జెన్‌జీ(2000 తర్వాత జన్మించినవారు) యువత ఎంతో ఇష్టపడుతారు. ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్, ఫ్యుచరిస్టిక్ డిజైన్‌కు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. ఇందులోని టీఎఫ్‌టీ వేరియంట్‌లో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలెక్సా, స్మార్ట్ వాచ్ అడాప్టబిలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్‌ఎంఎస్/కాల్ అలర్ట్‌లు వంటివి ఉన్నాయి’ అని చెప్పారు.
రైడ్ మోడ్‌లు, భద్రతకు సంబంధించి కూడా ఇందులో జాగ్రత్తలు వహించినట్లు కంపెనీ తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఇందులో రేస్ మోడ్, స్ట్రీట్ మోడ్ అనే డ్యూయల్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. పరిస్థితులుకు తగినట్లు ఏదైనా వాడుకునేందుకు వీలుంటుంది. క్రాష్ అలర్ట్, థెఫ్ట్ హెచ్చరిక, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, పార్క్ చేసిన ప్రదేశం, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
కంపెనీ వివరాల ప్రకారం.. 149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్‌పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.
ఇదీ చదవండి: భారతీయులకు అమెరికా మరో షాక్..