రాజన్న సిరిసిల్లా జిల్లా: వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వసీం, ఐపా అనే దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో రెండు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలవ్వగా హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. మృతులు కామారెడ్డికి చెందిన వారిగా తెలుస్తోంది.


