వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ లాంచ్‌, ఫీచర్లు చూశారా?

OnePlus Nord 2T launched in India: Price Specifications - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్  ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ ‘నార్డ్‌ 2టీ’ 5జీ ని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. జూలై 5 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై లాంచింగ్‌ ఆఫర్లు, డిస్కౌంట్లను కంపెనీ  అందిస్తోంది.  8జీబీ ర్యామ్‌/ 125 స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్   వేరియంట్లలో లభించనుంది.
 
ఆఫర్లు,  లభ్యత: అమెజాన్‌, వన్‌ప్లస్  స్టోర్లతో పాటు దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.  ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,500 తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.  అంటే  రూ. 27,499 లకే సొంతం చేసుకోవచ్చన్నమాట.

 8జీబీ ర్యామ్‌, 125 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. రూ. 28,999
12 జీబీ ర్యామ్‌, 256జీబీ  స్టోరేజహ మోడల్‌  ధరను రూ. 33,999 
 గ్రే షాడో అలాగే జేడ్ ఫాగ్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభ్యం.

‘నార్డ్‌ 2టీ’ 5జీ ఫీచర్లు
6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ 
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్
50+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 
32 ఎంపీ  సెల్ఫీ  కెమెరా 
4500 ఎంఏహెచ్‌ డ్యూయల్-సెల్ బ్యాటరీ,80W SuperVOOC ఛార్జింగ్  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top