Realme Narzo 60, Narzo 60 Pro 5G Launched in India, Check Price Details Inside - Sakshi
Sakshi News home page

రియల్‌మీ నార్జో సిరీస్‌ 5 జీ స్మార్ట్‌ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు

Jul 6 2023 6:13 PM | Updated on Jul 6 2023 6:47 PM

Realme Narzo 60 Narzo 60 Pro 5G Launched in India check Price Specifications - Sakshi

సాక్షి, ముంబై:   రియల్‌మీ నార్జో  సిరీస్‌లో కొత్త ఫోన్లు  వచ్చేశాయ్‌. రియల్‌మీ నార్జో 60,  రియల్‌మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో   లాంచ్‌ చేసింది.  ఈ రెండు డివైజ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో పాటు అమెజాన్ , రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా  జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్‌మీ నార్జో 60 ప్రొ  ప్రారంభ ధర  రూ. 23,999, రియల్‌మీ నార్జో 60  ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. 

రియల్‌మీ నార్జో 60 రెండు స్టోరేజ్  మోడల్స్‌లో  లభ్యం.  బేస్ వేరియంట్‌ 8జీబీ ర్యామ్‌, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర  రూ. 19,999 గా ఉంటుంది. 

రియల్‌మీ నార్జో 60 ప్రొ  8జీబీ ర్యామ్‌,  128 జీబీ స్టోరేజ్ రూ.  23,999   12జీబీ ర్యామ్‌,   1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999.

రియల్‌మీ నార్జో 60 ప్రొ  స్పెసిఫికేషన్స్‌ 
6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌
MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ 
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 
100 ఎంపీ+ 2ఎంపీ రియల్‌  కెమెరా 
16 ఎంపీ సెల్ఫీ కెమెరా  
 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 

రియల్‌మీ నార్జో 60   స్పెసిఫికేషన్స్‌ 
6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్‌
64+2ఎంపీ రియర్‌ కెమెరా
16ఎంపీ సెల్ఫీకెమెరా
 5,000mAh బ్యాటరీ,  33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

ప్రీ-ఆర్డర్ ఆఫర్‌:  నార్జో 60 5జీ కొనుగోలుపై   1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు.


 

Advertisement
 
Advertisement
Advertisement