దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ‘4జీ’ ఫోన్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. గతేడాది (2025)లో ఏకంగా 48 శాతం క్షీణించిన 4జీ ఫోన్ల షిప్‌మెంట్లు.. ఈ ఏడాది (2026) వార్షిక ప్రాతిపదికన 3 శాతం పుంజుకోనున్నాయని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ వెల్లడించింది. 5జీ ఫోన్ల తయారీ వ్యయం పెరగడంతో వినియోగదారులు తిరిగి 4జీ వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 4జీ వాటా 2025లోని 11 శాతం నుంచి 2026 నాటికి 13 శాతానికి, 2027 నాటికి 15 శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.
రూ.20 వేలలోపు అధిక డిమాండ్
స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరలు పెరగడంతో 5జీ ఫోన్లు బాగా ఖరీదయ్యాయి. దీంతో కస్టమర్లు రూ.10,000 లోపు (ఎంట్రీ లెవల్), 5జీతో పోలిస్తే తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పెర్ఫార్మెన్స్ లభిస్తుండటంతో 4జీ మోడళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పును గమనించిన మొబైల్ తయారీ కంపెనీలు రూ.10,000 నుంచి రూ.20,000 శ్రేణిలో కొత్త 4జీ మోడళ్లను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. బడ్జెట్ విభాగంలో 4జీ మోడళ్లను అందించే కంపెనీల సంఖ్య 2025లో కేవలం రెండే ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్య 12కు చేరడం విశేషం. ‘‘4జీకి డిమాండ్ కేవలం సంప్రదాయ ఎంట్రీ లెవల్ మార్కెట్‌కే పరిమితం కాకుండా రూ.20 వేలలోపు విభాగానికి విస్తరిస్తోంది. 5జీ ఫోన్లు అధిక ధరల శ్రేణికి వెళ్తుండటంతో ఈ విభాగంలో 4జీ ఫోన్లకు అవకాశాలు పెరుగుతున్నాయి’’ అనికౌంటర్‌పాయింట్ సీనియర్ అనలిస్ట్ ప్రచీర్ సింగ్ తెలిపారు.
ఇకపై 4జీ ‘వాల్యుఫర్‌మనీ’
కాంపోనెంట్ ధరలు సమీప భవిష్యత్తులో సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో 4జీకి డిమాండ్ కొనసాగవచ్చు. ఇది తాత్కలిక పరివర్తనం కాదు. మార్కెట్‌లో వస్తున్న దీర్ఘకాలిక మార్పు. వినియోగదారులు ధరతో పాటు ఫోన్ స్పెసిఫికేషన్లకు ప్రాధాన్యం ఇస్తుండటంతో కంపెనీలు శక్తివంతమైన 4జీ మోడళ్లను రూపొందిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంట్రీ లెవల్ కనెక్టివిటీ ఎంపికగా ఉన్న 4జీ.. ఇకపై ‘వాల్యూఫర్‌మనీ’ విభాగంగా మారే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక


