రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ | Chandrababu Naidu government is borrowing money every month | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

Nov 8 2026 3:12 AM | Updated on Nov 8 2026 3:13 AM

Chandrababu Naidu government is borrowing money every month

రాష్ట్ర అప్పులను రూ.11,12,416 కోట్లకు పెంచేసిన బాబు సర్కారు 

అప్పులు తీర్చాల్సింది పన్నులు, చార్జీల రూపంలో ప్రజలే

సగటున ప్రతి ఒక్కరి నెత్తిమీద అప్పు రూ.2,11,588 

ప్రతి నెల రూ.13,776 కోట్లు అప్పుచేస్తున్న చంద్రబాబు సర్కారు

సగటున రోజుకు రూ.460 కోట్లు అప్పు చేయందే పూట గడవడంలేదు

ఖజానాతో పాటు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అప్పులు 

మద్యం ఆదాయం, గనుల ఆదాయం తాకట్టుతో అప్పులు

గ్యారెంటీలు ఇస్తూ జీవోల మీద జీవోలు జారీ

ఈ వాస్తవాలు రాయకుండా ఎల్లో మీడియా బాబు భజన 

ఈ నెల 3న రూ.3 వేలకోట్ల బడ్జెట్‌ అప్పు

దీంతో చంద్రబాబు 29 నెలల్లో చేసిన అప్పు రూ.3,99,498 కోట్లు

ఇందులో బడ్జెట్‌ అప్పు రూ.రూ.2,29,537 కోట్లు

గ్యారెంటీ అప్పులు రూ.1,22,274 కోట్లు 

రాజధాని అప్పులు రూ.47,687 కోట్లు    

సాక్షి, అమరావతి: అప్పులు చేయకుండా సంపద సృష్టించి వైఎస్‌ జగన్‌ కన్నా మెరుగ్గా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తానంటూ మాయమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందరి నెత్తినా మోయలేని అప్పుల బండ పెట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తిన ఉన్న తలసరి అప్పును చంద్రబాబు 29 నెలల పాలనలోనే భారీగా పెంచేశారు. సగటున ప్రతి ఒక్కరి నెత్తిన అక్షరాలా 2 లక్షల 11 వేల 588 రూపాయల అప్పును రాష్ట్ర ప్రజలకు తన స్వర్ణాంధ్రపాలనలో గిఫ్ట్‌గా ఇచ్చారు. 

బాబు ఐదేళ్ల పాలన పూర్తయ్యేనాటికి ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తిన అప్పుల భారం రూ.5 లక్షలకు పెంచేస్తారని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అప్పులన్నీ మాకేం సంబంధమని ప్రజలనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ అప్పులను.. పన్నుల రూపంలోను, వివిధ చార్జీలుగా ప్రభుత్వానికి చెల్లిస్తూ ప్రజలే తీర్చాలి. ఇప్పటికే ఖజానాలో కనీస నిల్వ లేకుండా ఏడాదిలో 357 రోజులు అప్పులతో గడిపే స్థితికి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని, ఇలా అయితే భవిష్యత్‌ అంధకారమేనని కాగ్‌ మొట్టికాయలు వేసినా చంద్రబాబులో ఏమార్పు లేదు. 

చివరికి ఖజానాను, రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టేసి మరీ అప్పులు చేస్తున్నారు. మద్యం, గనుల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశారు. మద్యం ఆదాయం తాకట్టు పెట్టి ఇప్పటికే రూ.5,900 కోట్లు అప్పుచేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మరో రూ.11,700 కోట్లు మద్యం ఆదాయం ద్వారా అప్పు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా పట్టణ స్థానిక సంస్థల ఆస్తులను కూడా ప్రైవేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టేస్తున్నారు. 

చంద్రబాబు వచ్చాక అప్పులు రూ.11,21,416 కోట్లకు.. 
గత వైఎస్‌ జగన్‌ పాలనలో లేని అప్పులను బూచిగా చూపెట్టి తప్పుడు ప్రచారం చేసిన బాబు బృందం, ఎల్లోవీుడియా ఇప్పుడు బాబు పాలనలో రాష్ట్ర అప్పులను రూ.11,21,416 కోట్లకు పెంచేసినప్పటికీ.. మా బాబు విజనరీ, వాటర్‌మేన్‌ అంటూ గొప్పలకు పోతున్నాయి. వైఎస్‌ జగన్‌ పాలనలో ఎల్లో మీడియా లేని అప్పులు ఉన్నట్లు ఒకసారి రూ.10 లక్షల కోట్లు, మరోసారి రూ.11 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.14 లక్షల కోట్లు.. అంటూ విషప్రచారం చేస్తూ రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు చంద్రబాబు 29 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌ను అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తూ రాష్ట్ర అప్పులను రూ.11,21,416 కోట్లకు పెంచేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు.. వినిపించడం లేదు. సీఎం చంద్రబాబు 29 నెలల వ్యవధిలోనే బడ్జెట్‌ బయట, బడ్జెట్‌ లోపల, రాజధాని పేరుతో ఏకంగా రూ.3,99,498 కోట్లు అప్పు చేసినా ఎల్లోవీుడియా కళ్లుండి చూడలేని కబోదిలాగ వ్యవహరించడం గమనార్హం.

29 నెలల్లో బాబు అప్పులు రూ.3,99,498 కోట్లు 
29 నెలల పాలనలోనే చంద్రబాబు సర్కారు ఏకంగా బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట రికార్డు స్థాయిలో రూ.3,99,498 కోట్ల అప్పు చేసింది. ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం ద్వారా విక్రయించి రూ.3 వేలకోట్లు బడ్జెట్‌ అప్పు చేసింది. దీంతో బడ్జెట్, కార్పొరేషన్లు, రాజధాని పేరుతో చేసిన అప్పులు అక్షరాల రూ.3.99 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్‌ అప్పులే రూ.2,29,537  కోట్లున్నాయి. ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తూ కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు రూ.1,22,274  కోట్లకు చేరాయి. ఇక రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.47,687 కోట్లకు చేరాయి. బాబు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. 29 నెలల పాలనలో ప్రతి నెలా సగటున రూ.13,776 కోట్ల అప్పు చేస్తోంది.

రోజుకు సగటున రూ.460 కోట్లు ఆప్పు చేస్తోంది. అప్పులు ఇంకా ఎక్కువ చేయడం కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి పెరిగిపోతోందంటూ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారు. మరోపక్క వృద్ధిరేటు పెరిగితే ఆ మేరకు సంపద ఎందుకు పెరగడం లేదు.. అంటే ఆ వృద్ధి అంతా చంద్రబాబు అంకెల మాయాజాలం తప్ప మరొకటి కాదని స్పష్టం అవుతోంది. ఇన్ని అప్పులు చేసినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. కొత్తగా ప్రభుత్వరంగంలో ఒక రూపాయి ఆస్తి కూడా సృష్టించకపోగా గత వైఎస్సార్‌సీపీ సర్కారు ప్రభుత్వరంగంలో చేపట్టిన వైద్య కళాశాలలను, పోర్టులను, ఫిషింగ్‌ హార్బర్లను ప్రైవేట్‌పరం చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement