13,172 పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం | Arrangements for 13172 Panchayat elections | Sakshi
Sakshi News home page

13,172 పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం

Nov 8 2026 2:23 AM | Updated on Nov 8 2026 2:23 AM

Arrangements for 13172 Panchayat elections

ఎస్‌ఈసీకి ప్రభుత్వ సమాచారం

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 659 మండలాల పరిధిలోని 13,172 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) సమాచారమిచ్చింది. కోర్టు కేసుల కారణంగా కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తెలిపింది. దీనిప్రకారం  229 మండలాల్లో తొలిదశలోనూ 233, 197 మండలాల్లో తదుపరి రెండు, మూడు దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.  ఒక మండలంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలకు ఒకే రోజు ఎన్నిక నిర్వహించాలని ఇప్పటికే ఎస్‌ఈసీ నిర్ణయించింది. పోలింగ్‌ పూర్తయిన రోజే ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. 

షెడ్యూల్‌ ఇలా..
తొలి దశ:  నవంబర్‌ 13న నోటిఫికేషన్‌.. 26న 229 మండలాల్లో పోలింగ్‌
2వ దశ:  నవంబర్‌ 18న నోటిఫికేషన్‌.. 29న 233 మండలాల్లో పోలింగ్‌
3వ దశ: నవంబర్‌ 19న నోటిఫికేషన్‌.. డిసెంబర్‌ 2న 197 మండలాల్లో పోలింగ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement