మేం ఓడినా ప్రజల మనసులను గెలుచుకున్నాం: వైఎస్‌ జగన్‌ | Our Fight Continues Our Spirit Remains Unbroken YSRCP Chief YS Jagan | Sakshi
Sakshi News home page

మేం ఓడినా ప్రజల మనసులను గెలుచుకున్నాం: వైఎస్‌ జగన్‌

Nov 7 2026 9:47 PM | Updated on Nov 7 2026 10:07 PM

Our Fight Continues Our Spirit Remains Unbroken YSRCP Chief YS Jagan

తాడేపల్లి:  స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని, నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  చంద్రబాబు గెలిచి.. నైతికంగా ఓడిపోయారని, తాము ఓడిపోయినా ప్రజల మనసులు గెలుచుకున్నామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కూటమి అక్రమాలపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.

అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది* అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  

 

ఇదీ చదవండి: మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement