శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్: ధర ఎంతంటే? | Samsung Galaxy F70 5G Launched in India Know The Price and Features | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్: ధర ఎంతంటే?

Oct 19 2026 5:28 PM | Updated on Oct 19 2026 5:46 PM

Samsung Galaxy F70 5G Launched in India Know The Price and Features

పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్త. ఎందుకంటే.. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్‌70 5జీ లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎఫ్‌70 ప్రో 5జీ, ఎఫ్‌70ఈ 5జీ మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు మరో ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌70 5జీ ఫోన్‌లో 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ యూ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో పాటు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ కూడా ఇచ్చారు. ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 1330 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోనులో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

కొత్త శాంసంగ్ గెలాక్సీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి.. 4జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.19,999 కాగా, రెండు.. 6జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.17,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్‌ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది బోల్డ్‌ బ్లాక్‌, వివిడ్‌ వయలెట్‌ రంగుల్లో లభించనుంది.

ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. ప్రయోజనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement