జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. ప్రయోజనాలు | Jio New Recharge Plans Only Offer Voice and Validity | Sakshi
Sakshi News home page

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. ప్రయోజనాలు

Oct 19 2026 4:30 PM | Updated on Oct 19 2026 4:35 PM

Jio New Recharge Plans Only Offer Voice and Validity

భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారుల కోసం డేటా అవసరం లేని రెండు ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల(రూ.1748, రూ.448)ను అందిస్తోంది. సాధారణంగా మనం మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు.. ఎంచుకునే ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో పాటు ఇంటర్నెట్ డేటా కూడా ఉంటుంది. అయితే.. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అవసరం ఉండకపోవచ్చు. కొంతమంది ఫోన్‌ను కేవలం కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలాంటి వినియోగదారుల కోసం జియో ఈ ప్లాన్లను తీసుకొచ్చింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు, టెలికాం కంపెనీలు డేటా ప్రయోజనం లేని స్పెషల్ వాయిస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీనివల్ల ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా రీఛార్జ్ చేసుకునే అవకాశం లభించింది.

రూ.1,748 ప్లాన్‌
జియో అందిస్తున్న రూ.1,748 ప్రీపెయిడ్ ప్లాన్.. ఎక్కువకాలం వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం మాత్రమే కాకుండా.. మొత్తం 3,600 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు ఉంటుంది. అంటే దాదాపు 11 నెలల పాటు వ్యాలిడిటీ అన్నమాట. కాగా.. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. అయితే ఇందులో ఇంటర్నెట్ డేటా బెనిఫిట్ మాత్రం ఉండదు.

రూ.448 ప్లాన్‌
తక్కువ కాలం మాత్రమే రీఛార్జ్ కావాలనుకునే వారికోసం జియో రూ.448 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌తో కూడా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులోనూ ఇంటర్నెట్ డేటా ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement