
పచ్చని అడవి.. రాతి గుహలు.. వానకాలం వస్తే అమ్మవారి పాదాలను తాకే నదీ.. ఎంతో అద్భుతంగా కనిపించే దృశ్యాలు చూడాలనుకుంటున్నారా?. అయితే మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లె గ్రామంలోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి వెళ్లాల్సిందే.

12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం కనకదుర్గాదేవికి అంకితం. నల్లసరపు రాతితో చెక్కిన అమ్మవారి విగ్రహం, స్వయంభువుగా వెలసినదిగా చెబుతారు.

మెదక్ కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం మాత్రమే. అదే హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.












