సింగర్ మంగ్లీ కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లింది.
గురుపూర్ణిమ సందర్భంగా శ్రీశైలంలో కొలువై ఉన్న పార్వతి పరమేశ్వరులను దర్శించుకుంది.
అయితే గుడికి వెళ్లే సమయంలో ఒక అందమైన, అరుదైన దృశ్యం మంగ్లీ కంట పడింది.
దాన్ని క్లిక్‌మనిపించిన మంగ్లీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎప్పుడు ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సు, కృష్ణమ్మ ఒడిలో కనిపించింది .
ఎన్నో రంగులు విరచిమ్ముతూ, జీవితంలో ఉన్న భిన్నత్వానికి ప్రతీకగా ఈ ఇంద్రధనుస్సు కనిపించటం, ఆ దేవుని ఆశీస్సులుగా భావిస్తున్నాను.
తిరిగి వెళ్తుండగా, ఆ నందీశ్వరుడే గోమాత రూపంలో వచ్చి పండ్లు స్వీకరించి, ఆశీస్సులు ఇచ్చాడు అని పేర్కొంది.


