
పులస చేప ఉభయ గోదావరి జిల్లాల్లో నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఎంత ఫ్యామస్సో.. అంత ఖరీదు. అదిరిపోయే రుచి కూడా!

"పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి" అని అంటారు. పులస చేప రుచి ప్రత్యేకత అలాంటిది మరి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు.

హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు 'హిల్సా అని కూడా పిలుస్తారు.

పులస చేపల పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం.

పులస చేప రుచి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఇది నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతుంది .

ఈ చేప నీటి కోసం ఎదురీదే ప్రక్రియలో దాని రుచి మారిపోతుంది.

అన్నట్టు సముద్రంలో ఉన్నపుడు దీనిని ఇలస అంటారు.ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అప్పుడు దీనిని పులస అంటారు.

ఇది కేవలం జూలై ,ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో మాత్రమే దొరుకుతుంది.

ఇంకో సంగతి ఏంటంటే..కూర వండిన రోజు కాకుండా, ఆ మరునాడు తింటే ‘ఆహా.. పులస’ అనాల్సిందే. జన్మలో మర్చిపోరు. ఆయ్...అదండి మరి వలస చేప..పులస చేప సంగతి.

శుక్రవారం యానాం గౌతమీ గోదావరి పాయలో తొలిసారిగా పులస చేప వలకు చిక్కింది. పులస చేపను వేలం వేయగా స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం రూ.15 వేలకు చేపను దక్కించుకుంది. ఆపై మార్కెట్ లో రూ.18 వేలకు అమ్మంది.




