
కొనసాగుతున్న రికార్డు పరుగు...
ఢిల్లీలో ధర రూ.1,03,420; రూ.800 అప్
అంతర్జాతీయంగా ఔన్స్ 3,534 డాలర్లకు...
న్యూఢిల్లీ: అమెరికా విధానాల కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు కొనుగోళ్ల మద్దతుతో బంగారం దేశీయంగా నూతన జీవితకాల గరిష్టానికి (ఆల్‌టైమ్ హై) చేరుకుంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.800 పెరిగి రూ.1,03,420 స్థాయికి చేరింది. గురువారం ఒక్కరోజే రూ.3,600 పెరగడం తెలిసిందే. ముఖ్యంగా గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.5,800 లాభపడింది.
99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 పెరిగి రూ.1,03,000ను తాకింది. మరోవైపు వెండి కిలోకి రూ.1,000 పెరిగి రూ.1,15,000కు చేరుకుంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో వెండి సైతం రూ.5,500 పెరిగింది. ‘‘స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయ్యే కిలో, 100 ఔన్స్‌ల బంగారం బిస్కెట్లపై 39 శాతం టారిఫ్‌లను అమెరికా ప్రకటించడం కీలక సరఫరా మార్గంపై ప్రభావం చూపించింది. బులియన్ మార్కెట్లలో తాజా అస్థిరతలకు ఆజ్యం పోసింది.
బంగారం రిఫైనరీకి కీలక మార్కెట్ అయిన స్విట్జర్లాండ్‌పై అమెరికా టారిఫ్‌లు విధించడం సరఫ రాలపరంగా అనిశి్చతికి దారితీసింది. దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’ అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించిన టారిఫ్‌లు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలకు దారితీశాయని, ఇవి బంగారం ధరల పెరుగుదలకు కారణమైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్‌లో రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు సైతం పెరిగినట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 3,534 డాలర్ల వద్ద నూతన జీవితకాల గరిష్టాన్ని తాకి.. 3,500 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది.