Vivo Y35 Launched With Snapdragon 680 Chip In India: Check Price And Special Features - Sakshi
Sakshi News home page

Vivo Y35: స్లిమ్‌ ఫోన్‌ ‘వై35’  ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Aug 31 2022 11:37 AM | Updated on Aug 31 2022 4:26 PM

Vivo Y35 Launched With Snapdragon 680 Chip check Price and Specs - Sakshi

న్యూఢిల్లీ: వివో సంస్థ వై35 స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది చాలా స్లిమ్‌గా, నాజూకుగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌ ఉంటుంది. 6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 90 గిగాహెర్జ్‌ రీఫ్రెష్‌ రేటు, సైడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 44 వాట్‌ ఫ్లాష్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది.

8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,499. రెండు రంగుల్లో లభిస్తుంది. డాన్ గోల్డ్, అగేట్ బ్లాక్   రంగుట్లో  వివో ఇండియా ఆన్‌లైన్ స్టోస్టోర్‌తోపాటు దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లలో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్‌ బ్యాంక్‌ కార్డులపై రూ.1,000 క్యాష్‌బ్యాక్‌నుసెప్టెంబర్‌ 30వరకు అందిస్తున్నట్టు వివో ప్రకటించింది.



 

Advertisement
 
Advertisement
Advertisement