బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎల్‌డబ్ల్యూబీ వచ్చేసింది..!  | 2026 BMW X1 Long Wheelbase Launched In India | Sakshi
Sakshi News home page

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎల్‌డబ్ల్యూబీ వచ్చేసింది..! 

Aug 22 2026 5:37 AM | Updated on Aug 22 2026 5:37 AM

2026 BMW X1 Long Wheelbase Launched In India

ప్రారంభ ధర రూ.49.9 లక్షలు

న్యూఢిల్లీ:  లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎమ్‌డబ్ల్యూ’ భారత్‌లో సరికొత్త ‘ఎక్స్‌1 లాంగ్‌ వీల్‌బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ)’ ఎస్‌యూవీని శుక్రవారం ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.49.9 లక్షలు. తొలిసారి లగ్జరీ కారు కొనే కస్టమర్లను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దారు. 

సాధారణ వేరియంట్‌తో పోలిస్తే వెనుక సీటు ప్రయాణికులకు విశాలమైన లెగ్‌రూమ్, అదనపు స్పేస్‌ అందించడం విశేషం. ఈ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ‘ఎక్స్‌1 కొనుగోలుదారులలో 50 శాతానికి పైగా కస్టమర్లు తొలిసారిగా లగ్జరీ కార్ల విభాగంలోకి వస్తున్నవారే. కావున అదనపు స్పేస్, సౌకర్యాలతో కూడిన వెర్షన్‌ను తీసుకురావడం సరైన నిర్ణయం.   రెండో ఎలక్ట్రిక్‌ కారు ‘ఐ5 లాంగ్‌ వీల్‌బేస్‌ సెడాన్‌’  త్వరలో వస్తుంది’ అని బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇండియా చైర్మన్, సీఈఓ హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement