లోన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. PNB స్పెషల్ ఆఫర్స్! | PNB Launches Special Festival Campaign and Announces Offers For Retail Loans | Sakshi
Sakshi News home page

లోన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. PNB స్పెషల్ ఆఫర్స్!

Oct 6 2026 7:54 AM | Updated on Oct 6 2026 8:45 AM

PNB Launches Special Festival Campaign and Announces Offers For Retail Loans

పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు ప్రత్యేక లోన్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగానే.. పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్ 2026 పేరుతో ప్రత్యేక ఫెస్టివ్ రిటైల్ లోన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించిన ఈ క్యాంపెయిన్ ద్వారా.. పండుగ సమయంలో ఇల్లు కొనడం, కారు కొనడం లేదా ఇతర వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలనుకునే వారికి ప్రయోజనం కల్పించాలనేది బ్యాంక్ ఉద్దేశం.

ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌లో హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటి వివిధ రిటైల్ రుణాలపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు పీఎన్‌బీ వెల్లడించింది.

సాధారణంగా లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ప్రారంభ ఛార్జీలు కస్టమర్లపై అదనపు భారంగా ఉంటాయి. అయితే.. ఈ ఫెస్టివ్ ఆఫర్‌లో కొన్ని ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయడం ద్వారా కస్టమర్లకు లోన్ తీసుకోవడం మరింత సులభంగా చేయాలని బ్యాంక్ చూస్తోంది.

ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకునే వారికి బ్యాంక్ మంచి ప్రయోజనాలను ప్రకటించింది. హోమ్ లోన్‌పై అప్‌ఫ్రంట్, ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు.. కార్డ్ రేటుపై 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే.. అర్హత కలిగిన కస్టమర్లకు లోన్ తీసుకునే సమయంలో ప్రయోజనం పొందవచ్చు.

అదేవిధంగా కార్ లోన్ తీసుకోవాలనుకునే వారికి కూడా అప్‌ఫ్రంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో పండుగ సమయంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ప్రారంభంలో చెల్లించాల్సిన అదనపు ఖర్చు తగ్గుతుంది.

ఇదీ చదవండి: గోల్డ్ రేటు మళ్లీ పెరుగుతుందా?.. HSBC అంచనా ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement