సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్-2’. 2023లో విడుదలైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో మరో అప్‌డేట్‌తో అభిమానులను ఉత్సాహపరించింది చిత్రబృందం. ఈసినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.


