రజనీకాంత్ రీల్ కోడలికి హీరోయిన్గా మరో ఛాన్స్
తమిళ నటుడు అరుణ్ విజయ్.. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1995లో 'మురై మాప్పిళై' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అలా మూడు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 'బ్రూస్ లీ', సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తడం, కుట్రం 23 ,మాఫియా , సెక్క సివంద వానం వణంగాన్ వంటి పలు చిత్రాలను కథానాయకుడుగా తన నటనా ప్రతిభకు ప్రదర్శించిన ఈయన రీసెంట్ టైంలో 'రెట్ట తల' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్‌కి తమిళ నేత వార్నింగ్)అరుణ్ విజయ్ ఇంతకు ముందు నటించిన 'పార్టనర్' అనివార్య కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఈయన ముత్తయ్య దర్శకత్వంలో హీరోగా చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కుట్టి పులి, కొంబన్, మరుదు, విరుమన్ వంటి చిత్రాలతో ముత్తయ్య ఫేమస్. ఇందులో నటుడు అరుణ్ విజయ్ జంటగా 'జైలర్' ఫేమ్ మిర్నా మీనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన మిర్నా.. హీరోయిన్గా ఇది మంచి అవకాశమే అవుతుంది.ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళంలో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన ప్రస్తుతానికైతే 'జైలర్ 2'లో రజనీకాంత్ కోడలి పాత్రలో, డాన్ బాస్కో అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత తమిళంలో హీరోయిన్గా అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)