మన దగ్గరా ఐఫోన్‌ 18 ప్రో వచ్చేసింది..  | Apple began selling the iPhone 18 Pro and iPhone 18 Pro Max in India | Sakshi
Sakshi News home page

మన దగ్గరా ఐఫోన్‌ 18 ప్రో వచ్చేసింది.. 

Sep 19 2026 5:11 AM | Updated on Sep 19 2026 5:11 AM

Apple began selling the iPhone 18 Pro and iPhone 18 Pro Max in India

రేటు రూ. 1,64,900 నుంచి ప్రారంభం 

స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్‌ స్టోర్స్‌ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్‌ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. 

పలువురు ఫ్యాన్స్‌ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్‌గ్రేడ్‌ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్‌ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్‌ అనేది చాలా పెద్ద బ్రాండ్‌ కూడా. సెప్టెంబర్‌ 12 సాయంత్రం ప్రీ–బుక్‌ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్‌ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్‌ అందుకున్నా‘ అని ఓ కస్టమర్‌ పేర్కొన్నారు. 

సెప్టెంబర్‌ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్‌ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్‌ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్‌ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్‌ తొలిసారిగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement