breaking news
entering
-
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్‌కు వచ్చారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్‌చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్‌తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్‌గా నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్‌కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్‌ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్‌కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్‌ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్‌లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, సునీల్‌తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్‌తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్‌గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్‌గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్‌లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్‌గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్‌హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్‌లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా నటించారు. హిందీలో ఎన్టీఆర్‌కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్‌గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్‌గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
జార్వో... దూసుకొచ్చాడు మళ్లీ!
ఇంగ్లండ్‌కు చెందిన తుంటరి అభిమాని జార్వో మళ్లీ హద్దు మీరాడు. టీమిండియా డ్రెస్ వేసుకొని హల్చల్ చేస్తున్నాడు. ఇది ఒకసారైతే సరదాగా అనిపించినా... పదేపదే మైదానంలోకి దూసుకొస్తుండటం, ఆటగాళ్లను చేరుకోవడం, తాకటం క్రికెటర్ల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. లార్డ్స్, లీడ్స్ వేదికల్లో జార్వో భారత ఆటగాడి వేషంతో మైదానంలోకి దిగాడు. అతని చేష్టలెంతగా ఉన్నాయంటే జట్టు సభ్యుడే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఇక ‘ది ఓవల్’లో అయితే అతని తుంటరితనం పరాకాష్టకు చేరింది. ఈసారి ఏకంగా బౌలింగ్ చేయడానికే వచ్చాడు. భౌతిక దూరం పాటించాల్సిన కరోనా కాలంలో ఇలా బయటి వ్యక్తులు ఆటగాళ్లను తాకడం ఏంటని పలువురు క్రికెటర్లు భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జార్వో చర్యను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. అతనిపై ఫిర్యాదు చేయడంతో సౌత్ లండన్ పోలీసులు జార్వోను అరెస్టు చేసినట్లు సమాచారం. -
యజమాని ప్రాణాలను కాపాడిన పిల్లి.. నాలుగడుగుల పాముతో..
భువనేశ్వర్: సాధారణంగా కొంత మంది మూగజీవాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే.. కుక్కలు, పిల్లులు.. తదితర జీవులను తమ ఇంట్లో పెంచుకొని కుటుంబంలో ఒకటిదానిలా చూసుకుంటారు. అవి మనుషుల కన్నా విశ్వాసంగా ఉంటాయని నమ్ముతుంటారు. అయితే, ఒక్కొసారి ఆ పెంపుడు జీవులు తమ యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని కపిలేశ్వర్కు చెందిన సంపద్ కుమార్ పరిడా ఒక పిల్లిని పెంచుకున్నారు. దాన్ని ప్రేమతో చినుఅని పిలుచుకునే వారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిగా చూసుకునేవారు. ఒకటిన్నర సంవత్సరాలుగా పిల్లిని పెంచుకుంటున్నారు. అది ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు.. పెరడు నుంచి ఒక నాగుపాము ఇంట్లో ప్రవేశించడాన్ని చిను గమనించింది. వెంటనే అరుచుకుంటూ వెళ్లి పాముకు ఎదురుగా నిలబడింది. అంతటితో ఆగకుండా.. అరుస్తు పామును తన పంజాతో కొట్టసాగింది. పిల్లి అరుపులు విన్న సంపద్ కుమార్ అక్కడికి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అక్కడ నాలుగడుగుల పాముతో తమపిల్లి పోరాటం చేస్తుంది. అవి రెండు పరస్పరం దాడిచేసుకుంటున్నాయి. పాము ఎంత బుసలు కొడుతున్నా.. పిల్లి ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. పామును చూసి భయపడిపోయిన సంపద్ వెంటనే స్నేక్ హెల్ప్ సోసైటీ వారికి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో, దాదాపు అరగంట పాముని ఇంట్లో ప్రవేశించకుండా.. చిను పోరాటం చేస్తునే ఉంది. సంపత్ కుమార్ పిల్లి, పాముల పోరాటాన్ని తన మొబైల్లో ఫోటోలు తీసుకున్నాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీవారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తన ఆ క్లిప్పింగ్‌లను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ రోజు తాము ఉన్నామంటే దానికి తమ పెంపుడు పిల్లి చిను మాత్రమే కారణమని తెలిపాడు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది. -
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 15 మంది గల్లంతు
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 15 మంది పంజాబీ యువకులు గల్లంతయ్యారు. వీరిలో 6 మంది బహమాస్ ద్వీపం నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ గల్లంతుకాగా, మరో 9 మంది మెక్సికో–అమెరికా సరిహద్దు గుండా ప్రవేశించే ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాత్నం చాహల్ తెలిపారు. యువకులను అమెరికాకు పంపేందుకు ఢిల్లీలోని ఓ ఏజెంట్‌కు రూ. 19.5 లక్షలు ఇచ్చారని చాహల్ ఆరోపించారు. అమెరికా వెళ్లిన తర్వాత యువకులతో మాట్లాడేందుకు మరో రూ. 45 లక్షలు మరి కొంత మంది ఏజెంట్లకు ఇచ్చారని తెలిపారు. వారు మెక్సికో చేరిన తర్వాత నుంచి యువకుల నుంచి అసలు సమాచారమే లేదని తెలిపారు. వారిని కనుక్కునే ప్రయత్నం చేయాలంటూ చాహల్ భారత ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
నమ్మలేక పోతున్నా
సరిగ్గా పదకొండేళ్ల క్రితం హీరో రామ్‌చరణ్ తొలి సినిమా ‘చిరుత’ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయ్యింది. అంటే రామ్‌చరణ్ ఇండస్ట్రీలో పదకొండు సంవత్సరాలను పూర్తి చేశారు. ‘మగధీర, ఎవడు, ధృవ, రంగస్థలం’ వంటి సినిమాలతో నటునిగా తనదైన పేరు సంపాదించుకున్నారు. ‘‘నేను సినిమా పరిశ్రమలోకి వచ్చి అప్పుడే పదకొండేళ్లు పూర్తయ్యా యంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే నటించడం స్టార్ట్ చేశాననే ఫీలింగ్ కలుగుతోంది. నా ఈ జర్నీలో భాగమైన నా దర్శకులు నిర్మాతలతో పాటు మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ఇప్పటి వరకు తను నటించిన సినిమాల పోస్టర్స్ అన్నింటినీ కలిపి ఓ ఫొటోలా తయారు చేసి, ఫేస్బుక్లో షేర్ చేశారు చరణ్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. -
'పురుషులు వెళ్లే ప్రతి చోటికి.. మహిళలు వెళ్లొచ్చు'
ముంబై : మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్‌లో ఉన్న శనిదేవునిఆలయంలో మహిళల ప్రవేశంపై బాంబే హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. పురుషులు వెళ్లే ప్రతిచోటికి మహిళలు వెళ్లొచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. మహిళలను ఆలయాల్లో ప్రవేశించకూడదని చట్టంలో ఎక్కడాలేదని తెలిపింది. ఏప్రిల్ 1న శని సింగ్నాపూర్ విషయమై మరోసారి విచారణ చేపట్టనుంది. అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా తెలపాలని ఆదేశించింది. విద్యా బాల్, నీలిమా వార్త అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు మహిళల ఆలయ ప్రవేశ నిరాకరణపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకపోవడం చట్ట విరుద్ధమని, ఇలా చేయడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయిదొందల ఏళ్లకు పైగా చరిత్రగల ఈ ఆలయంలో శనిదేవునికి మహిళలు పూజలు చేయడం నిషేధం. దీన్ని ఇటీవల ఒక మహిళ ఉల్లంఘించి పూజలు చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు