
రామ్‌చరణ్
సరిగ్గా పదకొండేళ్ల క్రితం హీరో రామ్‌చరణ్ తొలి సినిమా ‘చిరుత’ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయ్యింది. అంటే రామ్‌చరణ్ ఇండస్ట్రీలో పదకొండు సంవత్సరాలను పూర్తి చేశారు. ‘మగధీర, ఎవడు, ధృవ, రంగస్థలం’ వంటి సినిమాలతో నటునిగా తనదైన పేరు సంపాదించుకున్నారు. ‘‘నేను సినిమా పరిశ్రమలోకి వచ్చి అప్పుడే పదకొండేళ్లు పూర్తయ్యా యంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే నటించడం స్టార్ట్ చేశాననే ఫీలింగ్ కలుగుతోంది.
నా ఈ జర్నీలో భాగమైన నా దర్శకులు నిర్మాతలతో పాటు మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ఇప్పటి వరకు తను నటించిన సినిమాల పోస్టర్స్ అన్నింటినీ కలిపి ఓ ఫొటోలా తయారు చేసి, ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు చరణ్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది.