breaking news
iPhone 18 Pro
-
దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్
-
రేట్లు ఎక్కువే కానీ.. ఐఫోన్ యూజర్లకు మాత్రం బంపర్ ఆఫర్..
-
కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)
-
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
ప్రీమియం ఫోన్ మేకర్ యాపిల్ తన కొత్త ప్రో సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్లో వీటిని ఆవిష్కరించగా.. భారత్‌లో ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, సాధారణ విక్రయాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.వేరియబుల్ అపెర్చర్‌తో 48MP కెమెరాఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా విభాగంలో కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు తొలిసారిగా ‘మెకానికల్ వేరియబుల్ అపెర్చర్’ను యాపిల్ తీసుకొచ్చింది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా కాంతి ప్రవేశాన్ని మార్చడంతో పాటు ఫొటోల్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌పై ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రా వైడ్, 48MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్-క్వాలిటీ జూమ్, 40x వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. కెమెరా యాప్‌లో అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి ప్రొఫెషనల్ కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులు మార్చుకోవచ్చు.వీడియో విషయానికి వస్తే 4K డాల్బీ విజన్‌ను 120fps వరకు రికార్డ్ చేయొచ్చు. 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను కూడా యాపిల్ అందించింది.ఫొటోలు నిజమైనవో.. మార్చినవో గుర్తించే టెక్నాలజీఐఫోన్ 18 ప్రోలో Apple Reference Image అనే కొత్త ఫీచర్‌ను యాపిల్ ప్రవేశపెట్టింది. కెమెరా నుంచి వచ్చిన పిక్సెల్ డేటాకు క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్ జతచేసి, అసలు చిత్రానికి సంబంధించిన రిఫరెన్స్‌ను భద్రపరచే విధంగా దీనిని రూపొందించారు. దీంతో ఫొటోపై తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో గుర్తించడంలో సహాయపడుతుంది. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన చిత్రాలను గుర్తించే విధంగా SynthID సపోర్ట్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ల లభ్యత భిన్నంగా ఉండొచ్చు.A20 ప్రో చిప్రెండు కొత్త ప్రో మోడళ్లలోనూ A20 Pro చిప్ ఉంటుంది. 2nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్‌లో సిక్స్-కోర్ CPU, న్యూరల్ యాక్సిలరేటర్లతో ఏడు-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ Neural Engine ఉన్నాయి. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ కూడా అందుబాటులో ఉంది. మెరుగైన పనితీరును కొనసాగించేందుకు కొత్త తరం ‘వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్’ను కూడా యాపిల్ తీసుకొచ్చింది. A20 Pro, కొత్త థర్మల్ డిజైన్ కలయికతో ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమ స్థిరమైన పనితీరును అందిస్తామని కంపెనీ పేర్కొంది.కొత్త కనెక్టివిటీ చిప్స్వైర్లెస్ కనెక్టివిటీ కోసం కొత్త N1 చిప్‌ను ఉపయోగించారు. ఇది Wi-Fi 7, Bluetooth 6, Thread నెట్‌వర్కింగ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్యులార్ కనెక్టివిటీ కోసం యాపిల్ రూపొందించిన C2 మోడెమ్ ఉంది.120Hz డిస్ప్లే.. చిన్నదైన డైనమిక్ ఐలండ్ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల, ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ OLED డిస్ప్లేలు ఉన్నాయి. రెండింటిలోనూ 120Hz వరకు ప్రోమోషన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డైనమిక్ ఐలండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈసారి డైనమిక్ ఐలండ్ పరిమాణాన్ని తగ్గిస్తూ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దినట్లు యాపిల్ తెలిపింది. ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీస్‌ను ప్రదర్శించే సామర్థ్యం కూడా ఉంది.43 గంటల వరకు బ్యాటరీబ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్గత డిజైన్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా eSIM-ఓన్లీ వేరియంట్లలో సిమ్ ట్రే కోసం ఉపయోగించే స్థలాన్ని పెద్ద బ్యాటరీకి కేటాయించగలిగారు. యాపిల్ ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో 34 గంటల వరకు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది. MagSafe, Qi2 వైర్లెస్ ఛార్జింగ్‌తో పాటు USB-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.iOS 27తో AI ఫీచర్లుకొత్త ప్రో మోడళ్లు iOS 27తో వస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెరుగైన సిరి ఏఐ, స్క్రీన్‌పై కనిపిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం, యాప్‌ల మధ్య సందర్భాన్ని కొనసాగించే ఫీచర్లు, కెమెరా ఆధారిత విశ్లేషణ వంటి కొత్త సామర్థ్యాలను యాపిల్ అందిస్తోంది.భారత్‌లో ధరలు ఇవేఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB ధర రూ.3,14,900.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB రూ.2,04,900, 1TB రూ.2,54,900, 2TB రూ.3,29,900గా ఉన్నాయి.బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, కొత్త బర్గండీ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. భారత్‌లో సెప్టెంబర్ 12న సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.ఇదీ చదవండి: ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక! -
ఐఫోన్ 18 వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
-
ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇందులో కొత్త మోడల్‌లు వస్తున్నాయంటే ఐఫోన్ ప్రియుల్లో పండుగ వాతావరణం ఉంటుంది. అయితే వీటి ధరలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. కానీ భారత్‌తో పోలిస్తే కొన్ని ఇతర దేశాల్లో వీటి ఖరీదు కాస్త తక్కువే..యాపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు సంస్థ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 9న జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఈ మోడళ్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఐఫోన్ డ్యుయోకు మాత్రం అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు, అక్టోబర్ 23 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.భారత్‌లో ఎంత?భారత్‌లో ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ధర రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900గా ఉంది. రెండు మోడళ్లలోనూ 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ 2TB వేరియంట్ ధర 18 ప్రోలో రూ.3,29,900 కాగా, 18 ప్రో మ్యాక్స్‌లోనూ రూ.3,29,900 నుంచి ప్రారంభమవుతోంది.ఇక యాపిల్ తొలిసారిగా తీసుకొచ్చిన ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో 256GB ధర భారత్‌లో రూ.2,99,900. ఇందులో 7.6 అంగుళాల ఫోల్డింగ్ డిస్ప్లే, బయట 5.4 అంగుళాల డిస్ప్లే ఉంటాయి. A20 ప్రో చిప్‌తో వస్తున్న ఈ ఫోన్‌ను స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో విడుదల చేసింది.అమెరికాలోనే తక్కువ ధరదేశాల వారీగా ప్రారంభ ధరలను పోల్చితే అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ధర అత్యంత తక్కువగా కనిపిస్తోంది. అక్కడ 256GB ఐఫోన్ 18 ప్రో ధర 1,199 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.14 లక్షలు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర 1,299 డాలర్లు అంటే సుమారు రూ.1.23 లక్షలు. అయితే అమెరికా ధరలకు స్థానిక పన్నులు విడిగా వర్తించవచ్చు.జపాన్‌లోనూ భారత్ కంటే తక్కువజపాన్లో ఐఫోన్ 18 ప్రో 256GB ధర 2,19,800 యెన్లు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర 2,39,800 యెన్లుగా యాపిల్ ప్రకటించింది. ప్రస్తుత మారకపు విలువల ఆధారంగా చూస్తే ఇవి భారత్‌లోని ధరల కంటే తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జపాన్ ధరల్లో వినియోగ పన్ను కూడా చేర్చి ఉంటుంది.జర్మనీ, యూకేలో..జర్మనీలో ఐఫోన్ 18 ప్రో 256GB ధర 1,449 యూరోలు. యూరోను రూపాయల్లోకి మార్చితే ఇది సుమారు రూ.1.60 లక్షల పరిధిలో ఉంటుంది. కాబట్టి భారత్‌తో పోలిస్తే కొంత తక్కువే అయినప్పటికీ అమెరికా, జపాన్ స్థాయిలో చౌక కాదు.యూకేలో ఐఫోన్ 18 ప్రో ధర 1,199 బ్రిటిష్ పౌండ్ల నుంచి, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర 1,299 బ్రిటిష్ పౌండ్ల నుంచి ప్రారంభమవుతోంది. రూపాయి మారకపు విలువను బట్టి చూస్తే ఇవి భారత్ ధరలకు సమీపంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి.యూఏఈలోనూ తక్కువే..యూఏఈలో (UAE) ఐఫోన్ 18 ప్రో 256GB ధర 5,099 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమవుతోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర కూడా భారత్‌తో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంది. అందువల్ల విదేశాలకు వెళ్లే భారతీయులు ఐఫోన్ కొనుగోలు విషయంలో యూఏఈ, జపాన్, అమెరికా వంటి మార్కెట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది.డ్యుయోలోనూ భారీ ధర వ్యత్యాసంఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో అమెరికాలో 1,999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. భారత్‌లో అదే మోడల్ 256GB ధర రూ.2,99,900. జపాన్‌లో 256GB డ్యుయో ధర 3,64,800 యెన్లు, యూఏఈలో 8,499 దిర్హామ్‌లుగా ఉంది. అంటే డ్యుయో విషయంలోనూ దేశాన్ని బట్టి ధరలో గణనీయమైన తేడా కనిపిస్తోంది.అయితే విదేశాల్లో ఐఫోన్ ధర తక్కువగా ఉందని వెంటనే అక్కడే కొనడం మంచిదని చెప్పలేం. మారకపు రేటుతో పాటు స్థానిక పన్నులు, కస్టమ్స్ నిబంధనలు, వారంటీ/సర్వీస్ నిబంధనలు, eSIM లేదా ఇతర ప్రాంతీయ పరిమితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా అమెరికా ధరలకు రాష్ట్రాన్ని బట్టి సేల్స్ ట్యాక్స్ అదనంగా ఉండొచ్చు. -
ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..
టెక్ దిగ్గజం యాపిల్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ‘డ్యువో’ని ఆవిష్కరించింది. 7.6 అంగుళాల డిస్ప్లే, 5.4 అంగుళాల ఔట్‌సైడ్ స్క్రీన్, కొత్తగా డిజైన్ చేసిన ఐవోఎస్ 27 తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర 1,999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ–ఆర్డర్లు అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23 నుంచి అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లనూ యాపిల్ ఆవిష్కరించింది. వీటిలో 18 ప్రో ధర 1,199 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,299 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ని బట్టి 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల స్క్రీన్, ఏ20 ప్రో చిప్, 48 ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, మరింత ఆధునీకరించిన సిరి ఏఐ తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ప్రీఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, డెలివరీలు సెపె్టంబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త సీఈవో హోదాలో జాన్ టెర్నస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.భారత్‌లో బేస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతుంది. 512 జీబీ, 1టీబీ, 2టీబీ కాన్ఫిగరేషన్ల ధరలు వరుసగా రూ.3,24,900, రూ.3,74,900, రూ.4,49,900గా ఉంటాయి. ఐఫోన్ డ్యూయో స్టార్ వైట్, నైట్ స్కై కలర్ ఆప్షన్లలో వస్తుంది.


