లేటెస్ట్‌ ఐఫోన్.. తక్కువకే వస్తోంది! | iPhone 17 Pro iPhone 17 Pro Max price cut Croma iPhone 18 Pro pre-bookings | Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ ఐఫోన్.. తక్కువకే వస్తోంది!

Sep 14 2026 4:10 PM | Updated on Sep 14 2026 4:16 PM

iPhone 17 Pro iPhone 17 Pro Max price cut Croma iPhone 18 Pro pre-bookings

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐఫోన్‌ క్రేజ్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌ ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్‌ ఐఫోన్‌ 17 ప్రో (Apple iPhone 17 Pro) 256GB మోడల్‌ను ఎక్స్ఛేంజ్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను కలిపి రూ.69,990 కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

యాపిల​్‌ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌ను భారత్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ప్రస్తుత క్రోమా ఆఫర్‌తో 256GB వేరియంట్ ధర గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా ఐఫోన్‌ 15 ప్రో పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌కు ఇస్తే ఈ ఫోన్‌కు గరిష్ఠంగా రూ.44,500 వరకు ఇస్తోంది. దీనికి అదనంగా  రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభించవచ్చు. ఆపై ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.

ఉచితంగా కేస్

ధర తగ్గింపుతో పాటు క్రోమా మరికొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఐఫోన్‌ 17 ప్రో సిరీస్ కొనుగోలుపై రూ.3,499 విలువైన హైఫెన్‌ కేస్ కాంబోను ఉచితంగా అందిస్తోంది. దీంతో కొత్త ఫోన్‌కు ప్రొటెక్షన్ కేస్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

అలాగే ఐఫోన్‌ 17 ప్రో సిరీస్‌తో యాపిల్‌కేర్‌+ తీసుకునే కస్టమర్లకు 10 శాతం వరకు తగ్గింపు లభించే ఆఫర్ ఉంది. ప్రమాదవశాత్తు డ్యామేజ్ వంటి పరిస్థితుల్లో అదనపు రక్షణ కోరుకునే వారికి ఇది అదనపు ప్రయోజనంగా ఉంటుంది.

క్యాష్‌బ్యాక్

ఒకేసారి మొత్తం చెల్లించకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అర్హత కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీయూ (ICICI), ఏయూ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐడీఎఫ్‌సీ కార్డ్ ఈఎంఐ (EMI) వినియోగదారులకు కొన్ని సందర్భాల్లో రూ.5,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందని క్రోమా పేర్కొంది.

ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌పైనా తగ్గింపు

ఈ ఆఫర్ ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌కే పరిమితం కాదు. ఈ డిస్కౌంట్‌ డీల్‌లో  ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ (iPhone 17 Pro Max) 256GB వేరియంట్‌ ధర రూ.74,990 నుంచి ప్రారంభమవుతోంది. 512GB ప్రో మోడల్ రూ.88,490కు, ప్రో మ్యాక్స్‌ 512GB మోడల్ రూ.94,990 ధరకు లభిస్తున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement