breaking news
iPhone 17 Pro
-
రూ.60 వేలకే ఐఫోన్ Reliance Digital బంపర్ ఆఫర్
-
బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు!
ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి రిలయన్స్ డిజిటల్ ఓ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లపై పలు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి. దీంతో ఫోన్ రూ.56,990కే లభిస్తుందన్నమాట.ఐఫోన్ 17 ప్రోరిలయన్స్ డిజిటల్ ట్వీట్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ మోడల్ ధర రూ.1,34,900. ఇన్‌స్టోర్ డిస్కౌంట్ కింద రూ. 9,910 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.55,000 వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, అదనంగా రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే.. ఐఫోన్ 17 ప్రో రూ.56,990కి సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌ను బట్టి మారుతుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. దీని అసలు ధర రూ.1,49,900. రూ.9,910 ఇన్‌స్టోర్ డిస్కౌంట్ తర్వాత రేటు రూ.1,39,990కి తగ్గుతుంది దీనికి రూ.55,000 ఎక్స్చేంజ్ వాల్యూ, రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపితే.. చివరికి ధర రూ.71,990కి ప్రో మ్యాక్స్ లభిస్తుంది. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత!Your reason to go Pro just got bigger. 📱Get the iPhone 17 Pro starting at an effective price of just ₹56,990* at Reliance Digital.Unlock even more value with great exchange value, exchange bonus, bank cashback and flexible payment options.Want to know your current phone’s… pic.twitter.com/K7zV16eu0E— Reliance Digital (@RelianceDigital) September 23, 2026 -
ఫ్రీ iPhone 17 ఆఫర్.. ఎక్కడో తెలుసా..?
-
లేటెస్ట్ ఐఫోన్.. తక్కువకే వస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐఫోన్ క్రేజ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 17 ప్రో (Apple iPhone 17 Pro) 256GB మోడల్‌ను ఎక్స్ఛేంజ్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను కలిపి రూ.69,990 కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ప్రో మోడల్‌ను భారత్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ప్రస్తుత క్రోమా ఆఫర్‌తో 256GB వేరియంట్ ధర గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్కు ఇస్తే ఈ ఫోన్‌కు గరిష్ఠంగా రూ.44,500 వరకు ఇస్తోంది. దీనికి అదనంగా రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభించవచ్చు. ఆపై ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.ఉచితంగా కేస్ధర తగ్గింపుతో పాటు క్రోమా మరికొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఐఫోన్ 17 ప్రో సిరీస్ కొనుగోలుపై రూ.3,499 విలువైన హైఫెన్ కేస్ కాంబోను ఉచితంగా అందిస్తోంది. దీంతో కొత్త ఫోన్‌కు ప్రొటెక్షన్ కేస్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.అలాగే ఐఫోన్ 17 ప్రో సిరీస్‌తో యాపిల్‌కేర్+ తీసుకునే కస్టమర్లకు 10 శాతం వరకు తగ్గింపు లభించే ఆఫర్ ఉంది. ప్రమాదవశాత్తు డ్యామేజ్ వంటి పరిస్థితుల్లో అదనపు రక్షణ కోరుకునే వారికి ఇది అదనపు ప్రయోజనంగా ఉంటుంది.క్యాష్బ్యాక్ఒకేసారి మొత్తం చెల్లించకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అర్హత కలిగిన హెచ్డీఎఫ్సీ (HDFC), ఐసీఐసీయూ (ICICI), ఏయూ, ఐడీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐడీఎఫ్సీ కార్డ్ ఈఎంఐ (EMI) వినియోగదారులకు కొన్ని సందర్భాల్లో రూ.5,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందని క్రోమా పేర్కొంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పైనా తగ్గింపుఈ ఆఫర్ ఐఫోన్ 17 ప్రో మోడల్‌కే పరిమితం కాదు. ఈ డిస్కౌంట్ డీల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) 256GB వేరియంట్ ధర రూ.74,990 నుంచి ప్రారంభమవుతోంది. 512GB ప్రో మోడల్ రూ.88,490కు, ప్రో మ్యాక్స్ 512GB మోడల్ రూ.94,990 ధరకు లభిస్తున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.ఇదీ చదవండి: రీచార్జ్ ప్లాన్ ఒక్కటే.. బెనిఫిట్స్‌లో ఏది బెస్ట్?


