ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి రిలయన్స్ డిజిటల్ ఓ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లపై పలు డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి. దీంతో ఫోన్ రూ.56,990కే లభిస్తుందన్నమాట.
ఐఫోన్ 17 ప్రో
రిలయన్స్ డిజిటల్ ట్వీట్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ మోడల్ ధర రూ.1,34,900. ఇన్‌స్టోర్ డిస్కౌంట్ కింద రూ. 9,910 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.55,000 వరకు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్, అదనంగా రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్, మరో రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే.. ఐఫోన్ 17 ప్రో రూ.56,990కి సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌ను బట్టి మారుతుంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. దీని అసలు ధర రూ.1,49,900. రూ.9,910 ఇన్‌స్టోర్ డిస్కౌంట్ తర్వాత రేటు రూ.1,39,990కి తగ్గుతుంది దీనికి రూ.55,000 ఎక్స్‌చేంజ్ వాల్యూ, రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపితే.. చివరికి ధర రూ.71,990కి ప్రో మ్యాక్స్ లభిస్తుంది. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత!
Your reason to go Pro just got bigger. 📱
Get the iPhone 17 Pro starting at an effective price of just ₹56,990* at Reliance Digital.
Unlock even more value with great exchange value, exchange bonus, bank cashback and flexible payment options.
Want to know your current phone’s… pic.twitter.com/K7zV16eu0E— Reliance Digital (@RelianceDigital) September 23, 2026


