ఫోల్డబుల్‌ ఐఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతంటే.. | Apple foldable iPhone Duo launched Price Features | Sakshi
Sakshi News home page

ఫోల్డబుల్‌ ఐఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతంటే..

Sep 10 2026 7:10 AM | Updated on Sep 10 2026 7:31 AM

Apple foldable iPhone Duo launched Price Features

టెక్‌ దిగ్గజం యాపిల్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ‘డ్యువో’ని ఆవిష్కరించింది. 7.6 అంగుళాల డిస్‌ప్లే, 5.4 అంగుళాల ఔట్‌సైడ్‌ స్క్రీన్, కొత్తగా డిజైన్‌ చేసిన ఐవోఎస్‌ 27 తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర 1,999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ–ఆర్డర్లు అక్టోబర్‌ 18 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్‌ 23 నుంచి అందుబాటులో ఉంటుంది.  

మరోవైపు ఐఫోన్‌ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లనూ యాపిల్‌ ఆవిష్కరించింది. వీటిలో 18 ప్రో ధర 1,199 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్‌ రేటు 1,299 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ని బట్టి 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల స్క్రీన్, ఏ20 ప్రో చిప్, 48 ఎంపీ ఫ్యూజన్‌ మెయిన్‌ కెమెరా, మరింత ఆధునీకరించిన సిరి ఏఐ తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ప్రీఆర్డర్లు సెప్టెంబర్‌ 12 నుంచి, డెలివరీలు సెపె్టంబర్‌ 18 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త సీఈవో హోదాలో జాన్‌ టెర్నస్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారత్‌లో బేస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతుంది. 512 జీబీ, 1టీబీ, 2టీబీ కాన్ఫిగరేషన్ల ధరలు వరుసగా రూ.3,24,900, రూ.3,74,900, రూ.4,49,900గా ఉంటాయి. ఐఫోన్ డ్యూయో స్టార్ వైట్, నైట్ స్కై కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement